Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కు మార్ రెడ్డి
నవతెలంగాణ- హుజూర్నగర్ టౌన్
హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అన్యాక్రాంతమైన లేఅవుట్ లపై సమగ్ర విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్త మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు .శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్నగర్ గ్రామపంచాయతీగా ఉన్న నాటి నుండి నేటి మున్సిపాలిటీ వరకు వివిధ వెంచర్ల ద్వారా కేటాయించబడిన లేఅవుట్ స్థలాలు అన్యాక్రాంతానికి గురి కావడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు కార్యాలయంలో లేకపోవడం దారుణం అన్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములను అధికార పార్టీకి చెందిన కొందరు అడ్డదారుల్లో కాజేసేందుకు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో చోరీకి గురైన రికార్డులను వెంటనే వెలికి తీయాలని , స్థలాల రక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అంతేగాక ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతో పాటు తాను ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగిస్తామని తెలిపారు. అంతకుముందు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అల్లం ప్రభాకర్ రెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, ఐ ఎన్ టి సి రాష్ట్ర నాయకులు ఎరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, కౌన్సిలర్లు కె. శ్రావణ్ కుమార్, కోతి సంపత్ రెడ్డి, వెలిదండ సరిత ,విజయ, ధనమ్మ, రాజా నాయక్ ,నాయకులు సామల శివారెడ్డి, గల్లా వెంకటేశ్వర్లు, బాచి మంచి గిరిబాబు, ఎండి నిజాము ద్దీన్, ఎండి అజిజ్ పా ష , మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.