Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట్రెడ్డి
నవతెలంగాణ - ఆత్మకూర్ఎస్
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్ర వారం మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్య లు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రైతాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని, పూర్తిగా నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ ఉదారవాద, నయా సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభ పరిస్థితులు తీవ్రమౌతువూ వచ్చాయన్నారు. బీజేపీ పాలనలో గత ఏడేళ్లలోనే లక్ష మంది పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతరం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా దండ శ్రీనివాస్ రెడ్డి ,కార్యదర్శిగా సోమిరెడ్డి దామోదర్ రెడ్డి లను ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 10 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి సోమిరెడ్డి దామోదర్ రెడ్డి ,దండ శ్రీనివాస్ రెడ్డి, గుండు లింగయ్య, బెల్లంకొండ చక్రయ్యా, తండా చంద్రయ్య, యాతాకుల మల్లయ్య, గుండాల హేమలత, యాతాకుల వెంకన్న, మూల విజరు రెడ్డి ,బోప్పని కనకమ్మ, గోలి భాగ్యమ్మ ,నూకల గిరి ప్రసాద్ రెడ్డి ,ఎరుకల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.