Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ మీలా మహాదేవ్
నవతెలంగాణ-సూర్యాపేట
కరోనా మహమ్మారి ఎన్నో ఆర్థిక సంస్థలని అతలాకుతలం చేసిన అందరి సహకారంతో సుధా బ్యాంక్ వరుసగా లాభాలను ఆర్జిస్తుందని బ్యాంకు చైర్మెన్ మీలా మహదేవ్అన్నారు.శుక్రవారం స్థానిక ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ వారి 2021- 22 వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సుధా బ్యాంక్ దాదాపుగా 15 ఏండ్ల నుండి 0 ఎన్పీఏ నమోదు చేయడం బ్యాంకు పనితీరుకు అద్దం పడుతుందన్నారు. బ్యాంకు ఎండి పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ బ్యాంక్ రెండవ గ్రేడ్ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంకు వాళ్లు నమోదు చేయటం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గర్వకారణం అని తెలిపారు .ఈ సంవత్సరం ఒక కోటి మూడు లక్షల రూపాయలు లాభాలు అర్జించి బోర్డు అనుమతితో గతేడాది 15శాతం ఈ ఏడాది 15శాతం డివిడెంట్ వాటాదారులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా మాట్లాడుతూ సుధా బ్యాంక్ నిస్వార్ధంగా పనిచేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ఎన్నో మేలైన సేవలందిస్తుందని చెప్పారు.ప్రముఖ న్యాయవాది నాతిసవేందర్ మాట్లాడుతూ సుధా బ్యాంక్ పని తీరు చాలా బాగుందని పేర్కొన్నారు. బ్యాంక్ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రముఖ వ్యాపారస్తులు తోట శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం సుధా బ్యాంక్ తమ బ్రాంచ్యుల ద్వారా సేవలందించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు అనంతుల ప్రభాకర్, కమలేకర్ శంకర్ లాల్, ఏపూరి శ్రవణ్ కుమార్ ,డాక్టర్ మీలా సందీప్ కక్కిరెని చంద్ర శేఖర్, భూక్య సుజాత, మేనేజర్లు రవీందర్ రెడ్డి, సైదులు ,రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.