Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ- కోదాడరూరల్
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలపై కేంద్రం మొండి వైఖరి విడనాడాలని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుటు ఎల్ఐసి ఏజెంట్ నిర్వహిస్తున్న ధర్నా కు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పొదుపు లను పెంచి దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూత నిస్తున్న ఏజెంట్ల పై నిబంధనల పేరుతో వారి ఉపాధిని దెబ్బతీయడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎల్ఐసి ఏజెంట్ లకు న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలని, బోనస్ రేటు పెంచాలని,ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచాలని, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోహన్ రెడ్డి, డివిజన్ నల్ కోశాధికారి కలిశానని రమణారెడ్డి ,బ్రాంచి అధ్యక్షుడు కందుల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వట్టికుటి మల్లేశ్ ,కోశాధికారి సొందుమియా ,డివిజన్ నాయకులు గొంగిరెడ్డి నాగిరెడ్డి , ఏ యాదగిరి, బీవీఎల్ కాంతారావు, నంద్యాల రాంరెడ్డి ,కుంబాల శ్రీనివాస్ ,వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.