Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన ఒప్పందం చేసుకోవాలి...
- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి
- కార్మికులకు మద్దతు తెలిపిన వెల్లంకి మాజీ ఎంపీటీసీ
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం కార్మికులతో నూతన వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం 9వ రోజుకు చేరింది.కార్మికుల సమ్మెకు సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి, సీపీఐ (ఎం) నాయకులు వెల్లంకి మాజీ ఎంపీటీసీ కూరెళ్ళ నర్సింహ చారి లు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు 9రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సరైన పద్ధతి కాదన్నారు. కార్మికుల వేతనం పొంద కాలపరిమితి మూడు సంవత్సరాలు గడుస్తున్న కూడా కాలయాపన చేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే యాజమాన్యం స్పందించి కార్మికులతో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆర్థిక సహకారం అందించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గొరిగే సోములు మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి పాషా, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, ప్రతిష్ట కార్మిక యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు శ్రీనివాస్, సత్యనారాయణ,సత్యం,లలిత, బిక్షపతి,యాదయ్య, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.