Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి రెండేండ్లకోసారి సూర్యపేట వ్యవసాయ మార్కెట్ లో హామాలి కార్మికుల వేతనాలు పెంపు కోసం శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సమక్షంలో రైతు ప్రతి నిధులు, కార్మికుల ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్్ ఉప్పుల లలిత దేవి ఆనంద్ అధ్యక్షత న చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పనిధినాలు తగ్గడం వల్ల హామాలి, దడవారు, స్వీపర్, డబ్బా కార్మికులకు పూట గడవని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న రేట్ల పై 25 శాతం పెంచుకోవడం జరిగిందని తెలిపారు.మార్కెట్ కార్మికులకు ప్రయాణ ఖర్చులు, పిఫ్, ఇ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని, వయస్సు తో నిమిత్తం లేకుండా అందరికీ మూడు వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, విశ్రాంతి భవనం కేటాయించాలని కోరుతూ ఈ సందర్భంగా వివిధ డిమాండ్స్ కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, శారదా, విజయమ్మ, పద్మ ,ఉపేందర్, రాఘవులు, శంబు లింగం, రమేష్,మిల్లర్స్ నుండి రవీందర్ బోనాల,సివిల్ సప్లై డిఎం , మార్కెట్ సెక్రెటరీ ముక్రం, కాశీమ్,తదితరులు పాల్గొన్నారు.