Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్ పోచంపల్లి
వ్యవసాయ మార్కెట్లను రైతులు పండించిన పంటను మార్కెట్లోనే అమ్ముకొని ప్రభుత్వ మద్దతులను పొందాలని మార్కెట్ అభివద్ధికి రైతుల సహాయ సహకారాలు అవసరమని మండల పరిషత్ అధ్యక్షులు మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం పురపాలక కేంద్రం పరిధిలో రమాదేవి ఫంక్షన్ హాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అర్థ వార్షిక బహుజన సభ సమావేశం ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కొనుగోలు కేంద్రాలు వ్యవసాయ మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం రైతులు పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం రైతు ఖాతాలో డబ్బులు వేస్తుందన్నారు. పీఏసీిఎస్ చైర్మెన్ కందాల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు అందుబాటులోకి విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేశం మున్సిపల్ వైస్ చైర్మన్ లింగస్వామి మార్కెట్ డైరెక్టర్లు దొడమోని చంద్రము నోముల మాధవరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పి సుధాకర్ రెడ్డి కోట మల్లారెడ్డి శ్రీనివాస..లింగారెడ్డి బాల్ రెడ్డి డైరెక్టర్లు ఎంపీటీసీలు సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.