Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామంలో వర్షానికి ఓ ఇల్లు కూలి ప్రమాదం తప్పింది. బుజిలాపురం గ్రామానికి చెందిన పంగ హన్మంతు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లితో కలిసి పెంకుటింట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల కురుస్తున్న వరుస వానలతో ఇంటి గోడలు, పైకప్పు పూర్తిగా నాని బియ్యం, ఇతర వస్తువులు ఉన్న గది శుక్రవారం రాత్రి ఆకస్మాత్తుగా ఒక్కసారిగా కూలిపోయింది. హన్మంతు, భార్యాపిల్లలు, తల్లి ముందు గదిలో పడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.