Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు రూరల్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అధిక భారాలను ప్రజలపై మోపుతోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటిపౌల్ అన్నారు. శనివారం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో ఉపాధి కూలీల సమావేశం చౌడబోయిన స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం జీఎస్టీపేరుతో దోపిడీని ఆపాలని, ప్రజా విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్లో నిధులు తగ్గించిందన్నారు. కూలీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బొమ్మకండి లక్ష్మీనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షురాలు స్వప్న ,ఉపాధ్యక్షురాలు నర్సమ్మ,, మంజుల ,,లావణ్య ,పద్మ ,ప్రధాన కార్యదర్శి బరుగుల గణేష్ ,సత్తయ్య, నరసయ్య, యాదగిరి, సుధాకర్ ,అంజయ్య పాల్గొన్నారు..