Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ - రాజాపేట
సీఎం కేసీఆర్ మహిళ పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మీనాక్షి ఫంక్షన్ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు .ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళ పట్ల పెద్దన్న పాత్ర పోషిస్తూ ,దసరా కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన బిడ్డ కానుండి చనిపోయే రైతన్న వరకు ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు ద్వారా సహాయం అందిస్తున్నారని తెలిపారు. .బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా నేత కార్మికులకు వేల మందికి నేత కార్మికులకు ఉపాధి కలిపించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, స్థానిక సర్పంచ్ ఆడెపు ఈశ్వరమ్మ శ్రీశైలం, మమత ,స్వరూప, మదర్ డెయిరీ డైరెక్టర్ చింతలపూడి వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి ,తాసిల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీలు ,ఆత్మ చైర్మెన్వెంకటేశ్వర్ రెడ్డి ,రైతుబంధు అధ్యక్షులు గౌటే లక్ష్మణ్ ,కో ఆప్షన్ ముబారక్ పాల్గొన్నారు.