Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిమ్స్ డైరెక్టర్ బాటియా
నవతెలంగాణ -బీబీనగర్
రక్తదానం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియ అన్నారు .శనివారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్లు ప్రొఫెసర్లు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ డైరెక్టర్ డాక్టర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ , రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తా మార్పిడి కోసం ఒప్పందం కుదుర్చుకుందన్నారు, రక్తాన్ని సేకరించేందుకు అన్ని సౌకర్యాలు కలిగిన మొబైల్ బస్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ శిబిరంలో ఎయిమ్స్ డైరెక్టర్ తో పాటు 84 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు వైద్య విద్యార్థులు రక్తదానాన్ని చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శైలజ, డాక్టర్ నీరజ అగర్వాల్, డాక్టర్ రాహుల్ నారంగ్, తేజస్విని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భువనగిరి శాఖ డైరెక్టర్లు కోడారి వెంకటేష్, బాలాజీ పాల్గొన్నారు.