Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మండలంలోని ఎనగండితండ గ్రామంలోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కారు గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, సర్పంచ్ కరంటోతు నర్సింహానాయక్, పీపల్పహడ్ మాజీ సర్పంచ్ కరంటోతు మంతీనాయక్, మంగ్య, బాలు, రఘు, కృష్ణ, రాజు, భాస్కర్, పవన్, శంకర్, పాండు, లచ్చీరామ్, సీతారామ్, శివ పాల్గొన్నారు.