Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
''గుడిసె కాలిపోయే.. గూడు చెదిరిపోయే'' కుటుంబం రోడ్డు పాలయే..దాచుకున్నదంతా బూడిద ఐన సంఘటన మండల పరిధిలోని అమ్మనబోలు గ్రామంలో శుక్రవారం సాయంత్రం షాట్ సర్కుట్తో జరిగింది. అమ్మనబోలు గ్రామంలో గత కొంతకాలంగా కడమంచి విష్ణుచక్రం దినసరి కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తున్నారు. గ్రామంలో మసీదు పక్కన పూరి గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. సాయంత్రం అనుకోకుండా గుడిసెలో మంటలు వ్యాపించాయి. వెంటనే గుడిసెలో నుంచి బయటికి రావడంతో ఇలాంటి ప్రాణహాని జరగలేదు. గుడిసె పూర్తిస్థాయిలో దగ్ధం అయింది. గుడిసెలో దాచుకున్న 30 వేల రూపాయలతో అన్ని వస్తువులు కాలిపోయి కట్టు బట్టలతో రోడ్డుపై పడ్డ హదయ విచారణ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి ఆ గ్రామ సర్పంచ్ బద్దం వరలక్ష్మి రాంరెడ్డి ఎంపీటీసీ కొంపెల్లి సైదులు వెళ్లి పరిశీలించారు. అధికారులు స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు.