Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్తి కొనుగోళ్ల పై సమీక్ష సమావేశం
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పత్తి పంటకు ప్రయివేట్ మార్కెట్లో మద్దతు ధర లభించకుంటే మద్దతు ధర చెల్లించి నాణ్యత ప్రమాణాల మేరకు కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు సిద్ధంగా ఉన్నారని అదనపు కలెక్టర్ భాస్కర్రావు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్లో పత్తి కొనుగోళ్ల పై సీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ, తూనికలు, కొలతలుశాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6 లక్షల 41 వేల302 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 51 లక్షల 64 వేల 757 క్విటాళ్ల పత్తి దిగుబడి రానుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని తెలిపారు. అక్టోబర్ 15 నుండి పత్తి కొనుగోలుకు మార్కెటింగ్, సీసీఐ అధికారులు, సిద్ధంగా ఉండాలని, ఇందుకు సబందించి సాప్ట్వేర్ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పత్తికి ప్రయివేట్ మార్కెట్లో క్వింటాకు మద్దతు ధర రాకుంటే, రూ.6,380 క్వింటాల్ కు మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు సిద్ధంగా వున్నారని వెల్లడించారు. అగ్ని మాపక శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు పరిశీలన చేయాలని ఆదేశించారు. తూనికలు కొలతలు శాఖ అధికారులు వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సుచరిత, తూనికలు, కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, సీసీఐ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.