Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-హలియా
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హాలియా మార్కెట్ యార్డ్‌లో జరిగిన నియోజకవర్గ వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వామపక్షాల అనేక పోరాటాల ఫలితంగా అటవీకుల చట్టం, ఉపాధి హామీ చట్టం, కనీస వేతన చట్టం, భూ సంస్కరణల చట్టం, అసైన్మెంట్ చట్టం సాధించుకున్న అమలుకు మాత్రం నోచుకోవడం లేదన్నారు. పాలకులు ఈ చట్టాలను బలహీనపరచడం కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రైతులు విత్తనం నాటిననాటి నుండి పంట అమ్ముకునే వరకు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేసి రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ వ్యవసాయాల పేరుతో రైతు వ్యతిరేక విధానాలు అవలంబించే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. హాలియాలో పార్టీ ఎయిట్ సర్వే నంబర్లో నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలని, రోడ్డు, కరెంటు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో జరిగే రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోన్‌రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అవతా సైదులు, కొండేటి శ్రీను, సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, మండల కార్యదర్శులు కొర్ర శంకర్‌నాయక్, కందుకూరి కోటేష్, నాయకులు కోమండ్ల గురువయ్య, నల్ల సోమయ్య, పొదిల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.