Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో అనుమతులు లేని ఆస్పత్రులు, అర్హత లేని వారు వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ కోటాచలం హెచ్చరించారు.అందులో భాగంగా శుక్రవారం స్థానిక తన కార్యాలయంలో ప్రత్యేక తనిఖీ బృందాలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీ చేయడం కోసం ప్రత్యేకంగా 8 బృందాలను ఏర్పాటుచేశామన్నారు.నాణ్యతా ప్రమాణాలు పాటించని ఆసపత్రులపై యాజమాన్యంప మాకఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.రోగుల సౌకర్యాల మెరుగుదల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కృషి చేస్తున్నా మన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీడీఎంహెచ్ఓ హర్షవర్ధన్, డాక్టర్ నిరంజన్ ,డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయశ్యాంసుందర్, డెమో అంజయ్య, కిరణ్, భాస్కర్‌రాజు, భూతరాజుసైదులు తదితరులు పాల్గొన్నారు.
పలుఆస్పత్రులపై ఆకస్మిక తనిఖీలు...
పట్టణంలోని బస్టాండు పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులపై అధికారులు ఆకస్మికతనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పలుఆస్పత్రుల్లోని రికార్డులు తనిఖీ చేశారు.ఆస్పత్రులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.సరైన ధృవపత్రాలు లేకుండా ఆస్పత్రులను నడిపించడంచట్టరిత్యా నేరమన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్థన్, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి కల్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠినచర్యలు తీసు కుంటామన్నారు.అనర్హులు ఆస్పత్రులు ఏర్పాటు చేయొద్దన్నారు.ఈ సందర్భంగా సూర్యా పేటలోని సూర్యతేజ ఆస్పత్రిని, తెలంగాణ ఆస్పత్రిని,ఎస్ఎం డెంటల్ ఆస్పత్రిలో డాక్టర్ లేకుండానే కాంపౌండ్ వైద్యం చేయడంతో అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఆస్పత్రిని సీజ్ చేశారు.ఆర్ఎంపీలు నడుపుతున్న ఎస్కె.సలీం ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను, స్వాతి ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లను , సత్యనారాయణ ఫస్ట్‌ఎయిడ్ సెంటర్, ప్రణవి క్లినిక్, విగేశ్వర క్లినిక్‌లను సీజ్ చేశారు. ఇంకా కొన్ని ఆస్పత్రిలో తాళాలు వేసుకోవడం అందుబాటులో లేకపోవడం గమనించారు.సూర్యల్యాబ్ను, లాస్య ల్యాబ్ తనిఖీ చేసి నోటీసులు అందించారు.నోటీసులు అందుకున్న వారు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు. సరైన వివరణ లేకపోతే సీజ్ చేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జయా శ్యాంసుందర్, శ్రీనివాసు, వీరయ్య,భూతరాజు సైదులు, యాతాకుల మధుబాబు, కొండ్లె శ్రీనివాస్, జగదీష్, ప్రవీణ్, భాస్కర్ పాల్గొన్నారు.
పలు ఆస్పత్రులలో ఆకస్మిక తనిఖీ
నేరేడుచర్ల :నేరేడుచర్లలోని మెయిన్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లోని పలుఆస్పత్రులపై అధికారులు శనివారం తనిఖీ నిర్వహించారు.పలుఆస్పత్రుల్లోని రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రులకు సంబంధించిన పత్రాలను పరిశీలిం చారు.సరైన ధ్రువపత్రాలు లేకుండా ఆస్పత్రులు నడిపించడం చట్టరీత్యా నేరమన్నారు.తనిఖీబృందాల ప్రత్యేకాధికారి కల్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అర్హతలు లేని వారు ఆస్పత్రులు ఏర్పాటు చేయొద్దని సూచించారు.నేరేడుచర్లలోని ఆర్ఎంపీలు నడుపుతున్న వెంకట శివ ఫస్ట్‌ఎయిడ్ సెంటర్, కోటయ్య ఫస్ట్‌ఎయిడ్ సెంటర్లను సీజ్ చేశారు.అర్హత కలిగిన టెక్నీషియన్లు లేకుండా నడిపిస్తున్న వెంకటేశ్వర ల్యాబ్ ,పూర్తిస్థాయి సౌకర్యాలు లేని స్నేహల్యాబ్లను సీజ్ చేశారు.ఇంకా కొన్ని ఆస్పత్రుల్లో తాళాలు వేసుకోవడం అందుబాటులో లేకపోవడం గమనించారు. వెంకటేశ్వర ఆసుపత్రికి, సాయి శ్రీనివాస ఆస్పత్రులను తనిఖీ చేసి నోటీసులు అందించారు.వెంకటేశ్వర ఆస్పత్రిలో ఒక్క స్టాఫ్‌నర్స్ కూడా లేకపోవడం వల్ల నోటీసులు అందుకున్న వారు రెండువారాల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు.సరైన వివరణ లేకపోతే సీజ్ చేస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగయ్య, ప్రత్యేక అధికారులు భూతరాజు సైదులు, యాతాకులమధుబాబు, అంజయ్య, జగదీష్ పాల్గొన్నారు.
అనుమతి లేని వైద్యశాలలు సీజ్
మునగాల : అనుమతి లేని వైద్యశాలలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారుల బృందం తనిఖీలు నిర్వహిం చింది.శనివారం మండలకేంద్రంలో పలుప్రథమ చికిత్సాకేంద్రాలను సీజ్ చేశారు.అధికారుల తనిఖీ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యులు పలుకేంద్రాల క్లినిక్ బోర్డులపై పేర్లు తొలగించి తాళాలు వేసి వెళ్లిపోయినట్టు సమాచారం. అనుమతులు లేకుండా క్లినిక్‌లను నిర్వహిస్తున్న ప్రతిఒక్కరిపైనా చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు.