Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
సద్దుల బతుకమ్మ ఏర్పాట్లపై ఆర్డీవో జగన్నాధరావు ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం రెవెన్యూ, ఐసిడిఎస్, మునిసిపల్, మెప్మా, పోలీసు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. నేడు జరగనున్న సద్దుల బతుకమ్మ సందర్భంగా వల్లభరావు చెరువు వద్ద పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని, మహిళలు బతుకమ్మలతో వచ్చేందుకు స్కూల్ బస్ లు ఏర్పాటు చేయాలని, డిఈఓను కోరారు .వల్లభ రావు చెరువు వద్ద వేదిక ,త్రాగు నీరు,పారి శుద్యం,లైటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. మెప్మా,మహిళ శిశు సంక్షేమ శాఖలు,ఆన్ని శాఖల ఉద్యోగ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని,అన్ని శాఖలు సమన్వయం తో పని చేసి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశం లో శిశు సంక్షేమ శాఖ పి డి.సుభద్ర, డీఎస్పీ నర్సింహారెడ్డి, డి ఈ ఓ బిక్షపతి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.