Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు గాంధీజీ అని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని రామగిరి సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కమిషనర్ కేవీ.రమణాచారి గ్రంథాలయ చైర్మెన్ రేగట్టె మల్లికారున్రెడ్డి, వివిధ వార్డుల్ల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో..
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటాల చేశాడని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా గాంధీ153 వ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సురేష్‌కుమార్, ఆర్ఐలు స్పర్జన్ రాజు, హరిబాబు, ఆర్ఎస్ఐలు కళ్యాణ్ రాజ్, రాజీవ్, సాయి, మమత, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
ఎంజీయూ ఆధ్వర్యంలో..
నల్లగొండ కలెక్టరేట్ :మహాత్ముని తత్వం విశ్వ మానవ శ్రేయస్సుకు, శాంతి సామరస్యతలకు సుస్థిరాభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని ఎంజీయూ ఉపకులపతి ఆచార్య చొల్లేటి గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఎంజియూలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్‌సాగర్, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ ఒగ్గు సైదులు, హరి, డాక్టర్ సిహెచ్ శ్యాంసుందర్, రామ్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మల్ల మధు, విద్యార్థులు పాల్గొన్నారు.
మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో..
ప్రపంచ శాంతిని కోరుకున్న మహాత్మా గాంధీ బాటలో ప్రతి ఒక్కరు నడవాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్‌శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, స్వాతంత్య్ర సమర యోధులు, మున్సిపల్ కమీషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : నేటి యువత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి దైన రవీందర్, రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆధ్వర్యంలో వేరువేరుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి :మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి వేడుకలను ఎంపీడీవో జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పుల్లెంల సైదులు, ఎంపీపీ ముఖ్య సలహాదారుడు పోకల రాజు, ఎంపీఓ రవికుమార్, పంచాయతీరాజ్ ఏఈ నరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు టేకుల అంజి రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి రెడ్డి, ఆంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కొంపెల్లి వెంకట్ రెడ్డి, చీమల వీరేశం, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జనగాం సత్యనారాయణ పగిల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో శంకరయ్య మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండకింది అశోక్ రెడ్డి,మాజీ వార్డ్ నెంబర్ కొండ ఎల్లయ్య, 8 వ వార్డ్ నెంబర్ కొండ వెంకన్న ,మండల నాయకులు పెరిక శంకరయ్య, ఐతరాజు సైదులు,మాచాగిరి,కతర్ల శ్రీను,పుట్ట సంజీవ,తదితురులు పాల్గొన్నారు.
కొండామల్లపల్లి :మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆదివారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడి గ్రామంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముక్కామల రాజలింగంయాదవ్, గ్రామ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, సరిత, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ :చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 183వ జయంతి సందర్భంగా ఆదివారం మున్సిపల్ అధికారి వెంకటేశ్వర్లు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోధుమ గడ్డ జలంధర్ రెడ్డి గంట శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మహాత్మాగాంధీ 153 వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ కార్యాలయాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లో లీడర్ బత్తుల లక్ష్మ రెడ్డి, మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ తిరునగర్ భార్గవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర చాలా కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో..
గాంధీజీ కన్న కలలను నెరవేర్చాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ మున్సిపల్ ఫ్లో లీడర్ బత్తుల లక్ష్మారెడ్డిలు కోరారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో మహాత్మా గాంధీ, స్వర్గీయ లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, కౌన్సిలర్లు దేశిడి శేఖర్‌రెడ్డి, గంధం రామకృష్ణ, లావూరి రవినాయక్, కొమ్మన నాగలక్ష్మి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు నరేందర్, బసవయ్య సారెడ్డి శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో..
మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో భాగంగా బీసీ సంఘాల ఉద్యోగుల జేఏసీ నాయకులు పాల్గొని మహాత్మా గాంధీ 153వ జయంతి మిర్యాలగూడలో సాగర్‌రోడ్‌లో గల గాంధీ విగ్రహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ జేఏసీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్ , తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులుగౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్, సీపీఎస్ఈయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాయకులు నాగవల్లి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ :జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మెన్ చిట్టిబాబునాయక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఏడుకొండలు, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఏఈ ఆదినారాయణ, ఎంపీఓ వీరారెడ్డి, సూపర్డెంట్ కర్ణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మహాత్మ భారతదేశ నికి చేసిన సేవలు మరువలేని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, పుల్లెంల ముత్తయ్య మేకల రాజిరెడ్డి చిరుమర్తి యాదయ్య ఎంపీడీవో గుండుగొని యాదగిరి గౌడ్ , స్థానిక సర్పంచ్ గుడిమెట్ల స్రవంతి దోసపాటి విష్ణుమూర్తి,, తదితరులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి :
జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో యువత సన్మార్గంలో నడవాలని ఎంపీపీ వంగాల ప్రతాపరెడ్డి అన్నారు. ఆదివారం గాంధీజీ 153 వ జయంతిని పురస్కరించుకొని మండలంలోని మండల అభివృద్ధి, తహసీల్దార్ కార్యాలయాలలో,అన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటాలకు, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వై వల్లపురెడ్డి,స్థానిక సర్పంచ్ జి.సైదమ్మ, నాయకులు ఏ. నరసింహ, యర్ర యాదగిరి, పరమేష్ యాదవ్, కొండల్ యాదవ్,యంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.