Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడ్డగూడూర్
మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా ఎంపీపీ దర్శనాల అంజయ్య గాంధీ చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ ప్రేమలత, మాజీ ఎంపీటీసీ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి,రవీందర్, శివయ్య పాల్గొన్నారు.
వలిగొండరూరల్ : మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. దసరా పండగ సందర్భంగా గ్రామ పంచాయితీ సిబ్బందికి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానచైర్మెన్ ముద్దసాని కిరణ్‌రెడ్డి బట్టలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దసాని శశికళ రెడ్డి,ఉపసర్పంచ్ నర్సింహ, సింగిల్ విండో వైస్‌చైర్మెన్ బుచ్చయ్య,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భిక్షపతి,మాజీ సర్పంచ్ శంకరయ్య,మాజీ ఎంపీటీసీ శ్రీలత రమేష్ ,సెక్రెటరీ మచ్చగిరి, మాజీ ఉప సర్పంచ్ విష్ణు చారి,వార్డు సభ్యులు సత్యరాములు, అనసూర్య ,ఆశా వర్కర్ రేష్మ, అంగనివాడి టీచర్ ప్రేమలత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారులి
భువనగిరి: గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని గాంధీపార్క్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ,టీపీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఫోత్నక్ ప్రమోద్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ పాల్గొన్నారు.
పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా గాంధీ చిత్రపటానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలేసి నివాళులర్పించారు.ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ ఉపాధ్యక్షులు ఇరుకుల్ల రామకష్ణ క్లబ్ అధ్యక్షులు మంచాల ప్రభాకర్, కార్యదర్శి బల్లి సోమశేఖర్, సభ్యులు చామ నాగేందర్, పోకల సోమన్న, పద్మాల ప్రభాకర్, సోమ బానరస్, జిడిగం లక్ష్మయ్య, ఎడవెల్లి ప్రవీణ్, వుడుత శ్రీనివాస్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ వారి సహకారంతో గాంధీజయంతి తుర్కపల్లి ప్రభుత్వాస్పత్రికి ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ను రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ జిల్లా సెక్రెటరీ రమణ, అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డికి బహూకరించారు.అనంతరం రోగులకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్‌నాయక్, ఎంపీటీసీలు బోరెడ్డి వనజహన్మంతరెడ్డి, గిద్దె కరుణాకర్, మండల వైద్యాధికారి సుధీర్‌రెడ్డి, సీహెచ్ఓ రాజయ్య, రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ కార్యదర్శి సిహెచ్ పండరి, సభ్యులు ప్రతిపాటి రమణాకరరావు ,ఏం శ్రీనివాస్, ఎలమ కన్నె కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ :మున్సిపల్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి అదే విధంగా చిన్నకొండూరు రోడ్డులోని గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, కౌన్సిలర్లు కోరగోని లింగస్వామి, బండమీది మల్లేశం, తాడూరి శిరీషపరమేశ్, ఆలె నాగరాజు, ఎమ్‌డి.బాబాషరీఫ్, కామిశెట్టి శైలజ, గ్రంథాలయ ఛైర్మన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, బొడిగె బాలకష్ణగౌడ్, బత్తుల స్వామి, అంతటి బాలరాజుగౌడ్, పెద్దగోని రమేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలోః మున్సిపల్ కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఆ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గిరికటి నిరంజన్‌గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డిలు పూలమాలలేసి నివాళులర్పించారు.స్వీట్లు పంపిణీచేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు చిన్నంబాలరాజు, సర్పంచ్ కొర్పూరి సైదులు, నాయకులు నారెడ్డి అభినందన్‌రెడ్డి, బొడిగె ఆనంద్‌గౌడ్, దొడ్డి మల్లేశ్, శ్రీశైలం,జనార్దన్‌రెడ్డి, బండ్ల శ్రీకాంత్, శేఖర్, గంగదేవి రమేశ్, కంచర్ల జంగయ్య పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ :ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నారల నిర్మల వెంకటస్వామి గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, ఎంపీటీసీలు రాంపల్లి కృష్ణ, బొక్క కొండల్ రెడ్డి, రసాల మల్లేష్ యాదవ్, కంచి లలిత, గడ్డమీది చంద్రకళ, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కే అమీనాభి , అధికారులు సిబ్బంది, పాల్గొన్నారు.
భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో సర్పంచ్ ఎదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ గౌడ్,
వడపర్తి గ్రామంలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, అనంతారం గ్రామంలో సర్పంచ్ చిందమ్ మల్లికార్జున్, ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు సామల వెంకటేష్, చందుపట్ల గ్రామంలో చిన్నం పాండు, చీమల కొండూరు గ్రామంలో జీలుగు కవితా సతీష్ పవన్, నమాత్ పల్లి గ్రామంలో ఎల్లంల శాలిని జంగయ్య యాదవ్, వాడాయి గూడెం గ్రామంలో గుండు మనీష్ గౌడ్, బండా సోమవారం గ్రామంలో నానం పద్మ కష్ణ గౌడ్, వీరవెల్లి గ్రామంలో తంగేళ్లపల్లి కల్పనా శ్రీనివాస చారి, తుక్కాపురం గ్రామంలో నోముల పద్మ మహేందర్ రెడ్డి తో పాటు పలు గ్రామాలలో గాంధీజీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రామన్నపేట:మండలంలోని వివిధ గ్రామంలో గాంధీ జయంతి నిర్వహించారు.మండలకేంద్రంలో గాంధీచౌక్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలలేసి నివాళులర్పించారు.టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి సాల్వేరు అశోక్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి జమీరొద్దిన్, కొంపల్లి విజయనందం, డోగిపర్తి సుభాష్, కొంపల్లి సుదేష్, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంగం మండల అధ్యక్షులు కన్నెకంటి వెంకటేశ్వర ఆచారి, మాజీ సర్పంచ్ ఆకవరపు మధుబాబు, చోల్లేటి పాండురంగ చారి, సిరిపురం గ్రామపంచాయతీలో జడ్పిటిసి పు న్న లక్ష్మి జగన్మోహన్, సర్పంచ్ ఎంపీటీసీ బడుగు రమేష్, వెల్లంకి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, కొమ్మాయిగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ జల్లేల లక్ష్మి పెంటయ్య, రామన్నపేట గ్రామపంచాయతీలో సర్పంచ్ గోదాసు శిరీష పృథ్వీరాజ్, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బొమ్మలరామారం: గాంధీ జయంతి పురస్కరించుకొని మండలకేంద్రంలోని గాంధీ విగ్రహానికి టీవైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సుర్వీ వెంకటేష్‌గౌడ్ పూలమాలలేసి నివాళులర్పించారు.స్వాతంత్య్ర ఉద్యంలో పాల్గొని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు.
మోత్కూరు: మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం మోత్కూరు మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయాల్లో, ఆర్యవైశ్య సంఘం, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా గాంధీ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆయాకార్యక్రమాల్లో జడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొణతం యాకూబ్ రెడ్డి, మాజీ చైర్మన్ టి.మేఘారెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ మారయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, కమిషనర్ సి.శ్రీకాంత్, కౌన్సిలర్లు బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, పురుగుల వెంకన్న, వనం స్వామి, కూరెళ్ల కుమారస్వామి, గనగాని నర్సింహ, ఎండి.షాహిన్ సుల్తాన, పి.ఆనందమ్మ, జూనియర్ అసిస్టెంట్ ఆర్.ప్రభాకర్ రెడ్డి, ఎంపీవో రవూఫ్ అలీ, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, తీపిరెడ్డి మేఘారెడ్డి, మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను, ఎండి.మజీద్, ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ అధ్యక్షులు ఇరుకుల్ల వెంకన్న పాల్గొన్నారు.
రాజపేట : మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న రిలే నిరాహార దీక్ష లోను పాల్గొన్న జేఏసీ నాయకులు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ ఎంపీటీసీ బుడిగే రేణుక పెంటయ్యగౌడ్, ఉపసర్పంచి పల్లె ప్రవీణ్, గుర్రం సిద్ధిరాములు రామిండ్ల నరేందర్, గంజి పాండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ : మండలంలోని అనాజిపురం గ్రామంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహనికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండలఅధ్యక్షులు కోట స్వామి, ఉపాధ్యక్షులు ఎడ్ల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నుచ్చు నాగయ్య, సుక్క స్వామి, గ్రామ ఉప సర్పంచ్ మైలారం వెంకటేష్,చిన్నం శ్రీనివాస్, ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు బొల్లేపల్లి అశోక్, శ్రీరాం బాలరాజ్, పిట్టల వెంకటేష్,వార్డ్ మెంబెర్స్, గోగు శ్రీనివాస్, శ్రీరామ్ బాలకృష్ణ, శ్రీనివాస్,షాబు, ముద్రబోయిన వెంకటేష్, నాగయ్య లు పాల్గొన్నారు.