Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ డీటీసీపీ లేఅవుట్ చేసి అహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక వసతులతో గృహ నిర్మాణాలకు అనువైన ఇంటి స్థలాలను విక్రయాలు చేపడుతున్న ట్లు ఎలైట్ సాయి డెవలపర్స్ గౌరవ సలహా దారులు నంద్యాల దయాకర్‌రెడ్డి తెలిపారు.ఆదివారం పట్టణ శివారులోని పిల్లలమర్రి పరిధిలో ఎలైట్ సాయి డెవలపర్స్ ఆధ్వర్యంలో సాయి ప్రియ హిల్స్ వెంచర్ బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. జాతీయ రహదారికి ఆనుకొని 25 ఎకరాలలో సువిశాలమైన స్థలంలో 40 ఫీట్ల బీటీ రోడ్డులను వాకింగ్‌కు సౌకర్యంతో, మున్సిపల్, బోర్ నీటిని అందిస్తూ గృహ, వాణిజ్య నిర్మాణాలకు, పేదలకు అందుబాటులో లభించే విధంగా ఓపెన్ ప్లాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సలహా దారులు ఊర రామ్మూర్తి,వెంచర్ పార్ట్నర్స్ ఉప్పల ఆనంద్, తోట శ్యాం, కర్నాటి శ్రీనివాస్, చల్ల లక్ష్మీకాంత్, లక్ష్మీ ప్రసాద్, వెంకట రమణారావు, రవీందర్ రెడ్డి, వెన్న జవహర్ రెడ్డి, ప్రముఖులు మీలా మహదేవ్, పెద్దిరెడ్డి గణేష్, మొరిశెట్టి శ్రీనివాస్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.