Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
సామాజిక హక్కుల పోరాటాల్లో కేవీపీఎస్ కృషి అభినంధనీయమని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ అన్నారు.ఆదివారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం 24వ ఆవిర్భావ దినం సందర్భంగా కేవీపీఎస్ జెండాను జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్యాల కోసం కేవీపీఎస్ పనిచేస్తుందన్నారు.మహాత్మా జ్యోతిరావుఫూలే, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా పోరాడుతున్నామన్నారు.24 ఏండ్ల ప్రస్థానంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నడిపి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధించేందుకు ప్రధాన భూమిక పోషించిందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ స్మశాన వాటిక స్థలాల జీవో 1235 సాధించిందన్నారు. కులవివక్ష, అంటరానితనం, అసమానతలపై రాజీలేని ఉద్యమాలు నడిపిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నిలిగొండ కిషోర్, సీనియర్ నాయకులు అనిమల్ల ఆంజనేయులు చింతల శివ,ప్రభాకర్, మధు, రాంకిరణ్, జెశ్వంత్ పాల్గొన్నారు.
మార్కెట్ యార్డ్ దుకాణ సముదాయం ప్రారంభం
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో అదివారం మార్కెట్ యార్డ్ దుకాణ సముదాయానికి చెందిన శిలాఫలకాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మున్సిపల్ సూచనల ప్రకారం తొమ్మిది మడిగెల సముదాయంతో భవనం నిర్మాణం పనులు ప్రారంభిస్తారన్నారు.మడిగెలలో షాపింగ్ మాల్స్ మరియు రైతు ధాన్యం నిల్వలు చేసుకోవచ్చని తెలిపారు.వర్తకుల సంఘం సూచనల మేరకు మడిగల ఏర్పాటుకు కృషి జరిగిందన్నారు.అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మార్కెట్ అధికారులతో మాట్లాడి నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ జి.రవీందర్, రవీందర్, వైస్ చైర్మెన్ నాగరాజు, పురపాలక చైర్మన్ వస్పరి శంకరయ్య, వర్తక సంఘం నాయకులు వంటేరు వేంకటరెడ్డి , కామిటికార్ అశోక్, బొట్ల విశ్వం, బొట్ల పరమేశ్వర్ ,చింతకింది మురళి , ఇల్లెందుల మల్లేశం , టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్, కౌన్సిలర్లు బెతి రాములు, రాయపురం నరసింహులు,గిరిరాజు వెంకటయ్య, హరినాథ్ పాల్గొన్నారు.