Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని భువనగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలోనూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజి విగ్రహాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్‌లతో కలిసి ఆవిష్కరించారు.ముందుగా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి తన జీవితాన్ని త్యాగం చేసి,ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడని,సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలుగా మలుచుకుని, కొల్లాయి కట్టి,చేత కర్ర బట్టి,నూలు వడకి,మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ,కులాలూ ఒకటే అని చాటి చెప్పిన ఆ మహనీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు.ఈ మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య, వైస్‌ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్,మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,చందుపట్ల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, నాయకులు భల్గూరి మధుసూదన్ రెడ్డి,అతికం లక్ష్మీనారాయణ గౌడ్,కేశపట్నం రమేష్,అబ్బగాని వెంకట్ గౌడ్,కస్తూరి పాండు,కొండం స్వామి,పుట్ట వీరేష్, ఎంపీటీసీలు సామల వెంకటేష్, రాసాల మల్లేశం యాదవ్, బొక్క కొండల్‌రెడ్డి, కంచి లలిత, రాంపల్లి కృష్ణ, ఉడత శారద ఆంజనేయులు యాదవ్, సర్పంచులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.