Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజపేట
పాల ఉత్పత్తిదారుల సంక్షేమమే మదర్‌డెయిరీ లక్ష్యమని ఆ సంస్థ చైర్మెన్ లింగాల శ్రీకర్‌రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం మండలంలోని చిల్లింగ్ సెంటర్లో ఏర్పాటుచేసిన నూతన చైర్మెన్, డైౖరెక్టర్స్ అభినందన సభలో పాల్గొని ప్రసంగించారు.అనంతరం చైర్మెన్ శ్రీకర్‌రెడ్డి, డైరెక్టర్స్ గొల్లపల్లి రాంరెడ్డి, కస్తూరి పాండు, లను పాల సొసైటీ చైర్మన్లు శాలువాతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు నాణ్యమైన పాలు పోసి అధిక లాభాలు పొందాలని తెలిపారు.ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.4 ప్రోత్సాహకం వచ్చే విధంగా కషి చేస్తానని తెలిపారు.పాడి రైతులకు ప్రస్తుతం అందిస్తున్న పశుదాణా రేటును రూ.850 నుండి రూ.700 తగ్గిస్తామని హామీ ఇచ్చారు.డెయిరీని లాభాల బాటలోకి తీసుకొస్తానని తెలిపారు.పాడి రైతులు సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు.తనకున్న రెండేండ్ల పదవిని ఉపయోగించి రైతులకు ఒక సేవకుడిగా పని ఇస్తానని వాగ్దానం చేశారు.ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్స్ చింతలపూడి వెంకట్రాంరెడ్డి, గొల్లపల్లి రాంరెడ్డి, కస్తూరి పాండు ,మేనేజర్లు రవీందర్‌గౌడ్,రాములు, శేఖర్, సూపర్వైజర్ కనకయ్య, రాములు, చైర్మెన్లు కాలే నరసింహులు, మరల నాగరాజు, జయ రాములు, ప్రభాకర్, సామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.