Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు అన్నారు.ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణపనులకు ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం ఆయన మాట్లాడారు.మున్సిపాలిటీలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానన్నారు.సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహారెడ్డి, వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు తాడూరి శిరీషపరమేశ్, బండమీది మల్లేశ్, కోరగోని లింగస్వామి, ఆలె నాగరాజు, ఎమ్‌డి.బాబాషరీఫ్, గ్రంథాలయ చైర్మెన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, బొడిగె బాలకృష్ణ, అంతటి బాలరాజు, బత్తుల స్వామి, పేరేపల్లి స్వామిగౌడ్, సుభాశ్చారి, అయ్యాడపు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.