Authorization
Mon March 10, 2025 02:31:43 am
నవతెలంగాణ-భువనగిరి
స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అహింసా సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి ప్రపంచానికి సరికొత్త పోరుబాటను గాంధీ పరిచయం చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు.మహాత్మా గాంధీ గారి 153 వ జయంతి పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.గాంధీబాటలో పయనించిన దేశాలు ఎన్నో బానిసత్వం నుండి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు జాతిపిత అని కొనియాడారు. దక్షిణాఫ్రికాలో వివక్ష ను స్వయంగా ఎదుర్కొన్న వ్యక్తి అన్నారు.సత్యమేవ జయతే అని చాటి చెప్పిన మహాత్ముని జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వివరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి ,దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,వడ్డెబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోనిగాంధీ పార్క్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్‌తివారి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, చైర్మెన్ ఎన్నబోయిన అంజనేయులు, వైస్‌చైర్మెన్ చింతల కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా గ్రంథాలయచైర్మెన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లాఅధ్యక్షులు కొలుపుల అమరేందర్, గౌరవ వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్ :సత్యం, అహింస మార్గాలే మనిషిని ఉన్నతుడిని చేస్తాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి జ్యోతి వెలిగించి బాపూజీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, బీసీ సంక్షేమఅధికారి యాదయ్య, జిల్లా కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరావు చారి, అధికారులు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మహాత్మాగాంధీ ఆశయాల సాధన కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.మండలకేంద్రంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని బస్టాండ్ ఆవరణలో విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్, కౌన్సిలర్లు బెతి రాములు, రాయపురం నరసింహులు ఎర్ర దేవదానం,కో ఆప్షన్ నెంబర్ రాజేష్ గౌడ్, గిరిరాజు వెంకటయ్య, సంతోష్ కుమార్, బన్నీ, కటకం మల్లేష్, సముద్రాల కుమార్,ఎండి ఫయాజ్ , సీసా సత్తయ్య,చింతల సాయిబాబా,అశోక్ పాల్గొన్నారు.