Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేతన ఒప్పందానికి ముందుకు రావాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం నిర్లక్ష్యం వీడి కార్మికులతో చర్చలకు రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కోరారు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ లో పనిచేస్తున్న కార్మికులు ప్రతిష్ట ఇండిస్టీస్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్ట ఇండిస్టీస్ యజమాన్యం కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు.కార్మికులు సమ్మెబాట పట్టినా కూడా యాజమాన్యానికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా కూడా నేటికీ ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు.పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.కానీ కంపెనీ యాజమాన్యం కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ 11 నెలలుగా వేతన ఒప్పందానికి ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు.కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించలేని నిర్లక్ష్యంతో యాజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవ్వాల్సిన బోనస్, పెండింగ్ వేతనాలు ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విమర్శించారు. కంపెనీ యాజమాన్యం ఇదే నిర్లక్ష్య ధోరణితో ఉంటే, యాజమాన్యం మెడలు ఉంచడానికి రాష్ట్ర వ్యాప్త నిర్వహిస్తామని హెచ్చరించారు. తక్షణమే యాజమాన్యం ముందుకు వచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా మహాత్మాగాంధీ 153 వ జయంతి కార్మికులు ఘనంగా నిర్వహించారు.గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరిపాండు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఎండి పాషా, తుర్కపల్లి సురేందర్, ప్రతిష్ట ఇండిస్టీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, నాయకులు దూసరి వెంకటేశం, సత్యనారాయణ, బిక్షపతి, లలిత, శ్రీశైలం, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.