Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-మునగాల
మండల పరిధిలోని గణపవరం వాగుపై బిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం మండలంలోని నారాయణగూడెంలో దేవి నవరాత్రుల ఉత్సవాలకు హాజరయ్యారు.ఈసందర్భంగా గణపవరం వాగును పరిశీలించారు.వాగుపై వంతెన నిర్మాణం లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఎంపీ దృష్టికి తెచ్చారు.అంతకుముందు నారాయణగూడెంలో అ న్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పందినర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వుప్పుల జానకిరెడ్డి, వైస్‌ఎంపీపీ కొలి శెట్టి బుచ్చి పాపయ్య,పీఏసీఎస్ చైర్మెన్ చందా చంద్రయ్య, మండవ చంద్రయ్య, సోమపంగు గోపి పాల్గొన్నారు.