Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాంధీ జయంతిన రెచ్చిపోయిన బెల్ట్‌షాపులు,సిట్టింగులు
- నిద్రావస్థలో ఎక్సైజ్ శాఖ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మహాత్మా మన్నించు.. దేశానికి స్వతంత్రం తేవడంలో కీలకపాత్ర పోషించావు. మద్యపాన నిషేధం మూగజీవాల వద, నిర్మూలన కోసం అహింసాసిద్ధాంతాన్ని పాటించావు. 153 వ జయంతి అయినప్పటికీ ఆదివారం కదా అని ఎక్సైజ్‌శాఖ, పోలీస్‌శాఖ నిద్రమత్తులో ఉండడంతో నీ జయంతి ఆని చూడకుండా అంతా మా ఇష్టం తాగినోడికి తాగినంత అన్న చందంగా కేవలం వైన్ షాపులు మాత్రమే బంద్ అని పేరు తప్ప మద్యం ఎక్కడబడితే అక్కడే కిరణా షాపులు, బెల్ట్ షాపులు, అవసరమైతే ఫోన్ చేస్తే ఇంటికి కూడా తెచ్చి ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మండల శివారులోని ఎడవల్లి నెమ్మాని గ్రామాల్లో ఏకంగా బెల్ట్ షాపులను తెరిచి ఉంచి కావలసిన నీసు పదార్థాలను సైతం మద్యం ప్రియులకు భోజన ప్రియులకు అందజేశాం. మహాత్మా మమ్మల్ని మన్నించు.! అన్న చందంగా మండల వ్యాప్తంగా అధికారుల నిర్లక్ష్యంతో బెల్ట్ షాపుల్లో మద్యం అందుబాటులో ఉంచి ఉన్న ధర కంటే ఎక్కువగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. అడిగే వారు లేరు చేసేదేముందిలే అని బహిరంగంగా వ్యాపారం చేయడం వారి వంతు అయింది. చూసేవారు ఇదేమి చోద్యం మహాత్మా మమ్మల్ని మన్నించు అంటూ స్మరించుకుంటున్నారు.