Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
గట్టుపల్ మండల కేంద్రంలోని తేరటుపల్లి గ్రామంలో ఆదివారం ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా అడుగు పెట్టకూడదు అని డిమాండ్ చేస్తూ బ్యాంకు కాలనీలో కాలనీవాసులు ఫ్లెక్సీ బోర్డు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎంతమంది ప్రజా ప్రతినిధులు వచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాక గ్రామాల్లో అడుగుపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మలిగే ఆంజనేయులు, వెంకటేష్, రమేష్ ,పెద్దులు, సత్తమ్మ, స్వామి, రవితేజ, రాములు ,రాజు, యాదగిరి, హరిక్రిష్ణ మల్లేష్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.