Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శవయాత్ర
- టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మద్దతు
నవతెలంగాణ-మునుగోడు
సీపీఐ(ఎం)లో సర్పంచ్‌గా గెలుపొంది బీజేపీలో చేరడంతో సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య శవయాత్రను నిర్వహించగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం పీర్ల కొట్టం వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏండ్ల తరబడి కల్వకుంట్ల గ్రామం కమ్యూనిస్టుకు కంచుకోటగా పేరు పొందిన ప్రజలు నమ్మి గెలిపించుకుంటే ప్రజలను మోసం చేసి సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య తమ పదవికి పార్టీకిి రాజీనామా చేయకుండా పార్టీ మారడం దారుణమన్నారు. ప్రజా ప్రతినిధులను రాజీనామా చేయకుండానే పార్టీలో చేర్చుకున్న రాజగోపాల్‌రెడ్డికి ఎందుకు రాజనీతి తప్పుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామా చేసేంతవరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు, గ్రామ కార్యదర్శి నారబోయిన నరసింహ, బొందు అంజయ్య, అయితగోని యాదయ్య, పగిళ్ల మధు, బొందు సుందరయ్య, కట్ట ఆంజనేయులు, బోయ సురేష్, బొందు నవీన్, కట్ట లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.