Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఆత్మగౌరవం సమానత్వం కులనిర్మ్షులనకై పోరాడిదామని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. కేవీపీఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ కార్యాలయం ముందు కేవీపీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ కేవీపీఎస్ 1998 అక్టోబర్ 2న ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్య సాధనకోసం ఏర్పడిందని పేర్కొన్నారు. కేవీపీఎస్ ఏర్పడిన నాటి నుండి అనేక సమర సుశీల ఉద్యమాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో దళితులకు మహిళలకు రక్షణ లేకుండా పోతున్నదని, అత్యంత దారుణ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహయ కార్యదర్శి గాదే నర్సింహ్మ, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్, సీఐటీయూ జిల్లా అద్యక్షులు చినపాక లక్మినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు యండీ. సలీం, వెంకటేశ్, లెనిన్, యాదగిరి, హరిబాబు, నర్సింహ, కమిటి సభ్యులు పెరుమాల్ల విజరు,వేణు, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.