Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
వ్యవసాయ కూలీల రోజువారి కనీస వేతనం 600 రూపాయలు పెంచా లని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కత్తుల లింగస్వామి అన్నారు. ఆదివారం తిరుగండ్లపల్లి గ్రామంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మర్రిగూడ మండల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, కనీస వేతనాల చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే ఈ సంవత్సరం ఉపాధి హామికి లక్ష కోట్ల బడ్జెట్ నుంచి 72 వేల కోట్లకు కుదించి చేతులు దులుపుకుందని విమర్శించారు. చేసిన పనులకు సకాలంలో వేతనాలు రాని దుస్థితి ఏర్పడిందని,రానున్న బడ్జెట్లో 2 లక్షల కోట్లు రూపాయలు ఉపాది హామీకి కేటాయించి వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూతల వెంకటయ్య, మండల అధ్యక్షులు కొట్టం యాదయ్య, వ్యవసాయకార్మిక సంఘం మండల నాయకులు ఆకుల వెంకట్రామ్, నీలకంఠం రాములు, నారోజు లక్ష్మణాచారి, చామకూర యాదయ్య, చల్లం ముత్యాలు, కాగు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మర్రిగూడ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నీలకంఠం రాములు, ఉపాధ్యక్షులుగా నారోజు లక్ష్మినాచారి, చొప్పరి హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా ఆకుల వెంకట్రామ్, సహాయ కార్యదర్శలుగా గిరి వెంకటయ్య, కొర్ర దీప్లా నాయక్, కోశాధికారిగా శిరసావాడ ఎల్లయ్య, ఊరుపక్కక బద్రితోపాటు 11 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు.