Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న కుల వివక్ష, అంటరానితన నిర్మూలన కోసం సామాజిక న్యాయం సాధించేంతవరకు పోరాటం చేస్తూ అంతిమంగా కులరహిత సమాజ స్థాపనే కేవీపీఎస్ లక్ష్యమని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోట గోపి అన్నారు.ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్ ముందు కేవీపీఎస్ 24 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.దళితులు ఎదుర్కొంటున్న కులవివక్ష అంటరానితనం నిర్మూలన కోసం పోరాటం చేసి కులరహిత సమాజాన్ని స్థాపించాలనే ధ్యేయంతో కేవీపీఎస్ ఏర్పడిందన్నారు. కుల దురహంకార హత్యలపై, దళితులపై దాడులు, దౌర్జన్యాలు వంటి ప్రతి సంఘటనపై కేవీపీఎస్ ఉద్యమిస్తుందన్నారు.దేశ సమైక్యత,సమగ్రత కోసం మతోన్మాద అరాచకాలకు వ్యతిరేకంగా కోసం కెవిపిఎస్ పోరాడుతుందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో మతోన్మాద, మనువాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జిల్లా నాయకులు ఎలుగూరి గోవింద్, వేల్పులవెంకన్న, వీరబోయిన రవి,కృష్ణ,వినయ్, భార్గవి,నాగేశ్వరరావు, వెంకటేష్, వెంకటేశ్వర్లు, మంగమ్మ, నాగమ్మ పాల్గొన్నారు.