Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
దేశంలో అధికారంలో ఉన్న మనువాద పాలకుల నుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.ఆ సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుడకుడలోని దళితవాడలో ఆ సంఘం జెండాను సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పిండిగా నాగమణి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కోటగోపి మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం,కుల నిర్మూలన అనే లక్ష్యాల కోసం మహాత్మాజ్యోతిరావుఫూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కేవీపీఎస్ పోరాడుతుందన్నారు.24 ఏండ్ల ప్రస్థానంలో అనేక ఉద్యమాలు పోరాటాలు నడిపి రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధానభూమిక పోషించిందన్నారు.ఈ కార్యక్రమంలో జీఎంపీఎస్ జిల్లా సహాయకార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్,కేవీపీఎస్ నాయకులు కంచనపల్లి భిక్షం, కుమారి, గుద్దేటి జానమ్మ, కలకోట్ల రవిభార్గవి, జీడి రమణ, పడిదలలక్ష్మీ, కుషనపల్లి రాజు, పడిదల కిశోర్, బొజ్జ వీరయ్య,ఉబ్బపల్లి భిక్షమమ్మ, సోమమ్మ, సోమపంగు కృష్ణ, కాశయ్య పాల్గొన్నారు.