Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మండలంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం సద్దాల బతుకమ్మ వేడుకలు తీరొక్క రంగు పూలతో మహిళలు బతుకమ్మ పేర్చి, ప్రముఖ దేవాలయాల ముందు, స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో పెద్ద ఎత్తున ఆటపాటలతో ఘనంగా ఆడారు. కోమటిరెడ్డి లక్ష్మి మహిళలతో కలిసి ఆడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, మంచుకొండ కీర్తి సంజరు, మాజీ సర్పంచ్ కలమీ కొండ పారిజాత జనార్ధన్, పార్టీ నాయకులు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి: తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల్లో భాగంగా పూలను పూజించి పకతిని ప్రేమించే గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ ప్రజా గాయకురాలు విమలక్క అన్నారు మండల పరిధిలో ఫిలాయిపల్లి గ్రామంలో బహుజనుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై 9 రోజులపాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించి సోమవారం సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండుగ సంబురాలను అంబరాన్ని అంటే విధంగా తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఉత్సవాలతో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందాల హరీష్ యాదవ్ ఎంపీటీసీసుమలత లక్ష్మణ్ వార్డు సభ్యులు మార్త సత్యనారాయణ ప్రముఖులు పెద్దలు యువజన సంఘాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.