Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు రుణపడి ఉంటానన్న వెన్న సాయిఅమృత్రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డం వారి ఆధ్వర్యంలో లండన్ బతుకమ్మ - దసరా సంబురాలు-2022 కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట నివాసి జిల్లా బాల భవన్ స్టూడెంట్ వెన్న సాయిఅమృత్రెడ్డి పాల్గొని తన పేరిణి నాట్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.ఈ సందర్భంగా పలువురిచే ప్రసంశలు అందుకున్నారు.ఈ సందర్భంగా వెన్న సాయిఅమృత్రెడ్డి మాట్లాడుతూ చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన తనకు ఇంతటి అవకాశం కల్పించి ప్రఖ్యాతి గాంచిన పేరిణి నృత్య ప్రదర్శన లండన్‌లో చేయడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు.గురువులకు,జిల్లా బాలభవన్‌కు, తల్లిదండ్రులు వెన్న శ్రీనివాస్‌రెడ్డి, కవితలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్ర సంప్రదాయ పండుగ బతుకమ్మ పల్లెపల్లెలా, వాడవాడలా గణనీయంగా జరుపుకోవడం సంతోషకరమని కొనియాడారు.జిల్లా బాల్భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ విదేశాల్లో సైతం తెలంగాణ రాష్ట్ర కళలను ప్రదర్శించిన తమ స్టూడెంట్ వెన్న సాయిఅమృత్రెడ్డిని అభినందించారు.సూర్యాపేటకు ఘన కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టడం గర్వకారణమన్నారు.విద్యతో పాటు పలు కళలను స్టూడెంట్స్ శిక్షణ పొంది ప్రదర్శనలతో అందరి మన్ననలు పొంది రాష్ట్రానికి వన్నె తేవాలన్నారు.