Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రెండు కోట్ల విలువైన గంజాయిని సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలకేంద్రంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ప్రకాశ్గార్డెన్ వద్ద పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న రెండు కోట్ల విలువైన గంజాయిని ఎస్వోటీ స్పెషల్ బ్రాంచ్, ఆలేరు ,ఎల్బీనగర్ చెందిన స్పెషల్ టీమ్ పోలీసులు మండల కేంద్రంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ప్రకాష్ గార్డెన్ వద్ద కొబ్బరి లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో 900కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావులపాలెం నుండి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రాకు గంజాయిని తరలిస్తున్న మహారాష్ట్రలోని అహ్మదానగర్ జిల్లా సంగమేశ్వర్కు చెందిన వికాస్ బాబా సాల్వే , తానా శిరిడి, డ్రైవర్ కిషోర్ తుల్ జిరాం వాడేకర్ , యోగేశ్ దత్తు గైక్వాడ్ ,కోపగహనుకు చెందిన వినోద్ చంద్రవన్ కేల్కర్ , ఒరిస్సా రాష్ట్రం మాల్కనుగిరి జిల్లా చిత్రకొండ మండలం కూర్మనూరు గ్రామానికి చెందిన కోస చింటూ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .గంజాయితో పాటు 5 మొబైల్ ఫోన్లు , రూ.3100 నగదును స్వాధీనపర్చుకున్నారు. .నిందితులను గంజాయిని పోలీస్ స్టేషన్ కి తరలించారు . రాచకొండ కమీషనరేట్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు .ఈ ఆపరేషన్లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి సుధీర్ బాబు,ఏసీపీ నారాయణ రెడ్డి ,భువనగిరి డీసీపీ కె మురళీధర్ డిసిపి ప్రత్యేక కార్యాచరణ బందం డి వెంకన్న నాయక్ ,సీఐ నర్సింహారెడ్డి ,ఎస్ఐ ఎండి.ఇద్రిస్ అలీ , పోలీసులు పాల్గొన్నారు.