Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నల్లగొండ
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ శాఖ అధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రెమా రాజేశ్వరి పాల్గొని మాట్లాడుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గా మాత అందరికీ విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నరసింహ రెడ్డి, వెంకటేశ్వర రావు, నాగేశ్రరావు,మోగీలయ్య, సురేష్ కుమార్,వెంకట రమణా,రమేష్, ఏ.ఓ మంజు భార్గవి,సూపర్దెంట్ సబిత, సీఐలు, ఆర్ఐలు, మహిళా ఎస్ఐలు మానస, మమత, శ్రావణి,పోలీస్ కుటుంబ సభ్యులు,మహిళా కానిస్టేబుల్స్ మహిళాహోం గార్డ్ పాల్గొన్నారు.
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ తయారు చేయడంలో ఉపయోగించే పువ్వులు ధరలు ఆకాశాన్నంటుతున్నా వాటిని కొనడానికి వెనుకడుగు వేయలేదు. గతంలో రెండు సంవత్సరాలు కరోనా రావడంతో బతుకమ్మ పట్ల నామమాత్రంగా ఉన్న మహిళలు ఈసారి మాత్రం తమ సొంత గ్రామాలకు వెళ్లి బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో భువనగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో బతుకమ్మ ఆడటానికి మొరం, మట్టి పోయించి కూడళ్ల వద్ద విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయించారు. పట్టణ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులో బతుక మ్మలు ఆడి మల్లాయి ముద్దలు పంచుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి, వివిధ శాఖ అదికారులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి గౌరమ్మకు పూజలు చేసి బతుకమ్మలతో ఆడి పాడి ఆడపిల్లలు ఆటపాటలతో డ్యాన్సులు చేస్తూ సద్దుల బతుకమ్మను వివిధ గ్రామాల మహిళ ఆడపడుచులు ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఉత్సవాలను తిలకించారు.
ఆలేరుటౌన్ : పట్టణంలోని పలు కాలనీల్లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రకరకాల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చి వారి ఇండ్ల వద్ద పెట్టి ఆడిపాడారు. బతుకమ్మల వద్ద పప్పు , చక్కెర బెల్లం ో నైవేద్యం సమర్పించారు.అనంతరం పట్టణం లోనిశ్రీ కనకదుర్గ ఆలయం వద్ద ఆలేరు పెద్దవాగులో,బహదూర్‌పేట వద్ద రత్నాల వాగు వద్ద, సాయిగూడెం వద్ద పెదవాగు లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య, కమిషనర్ మారుతీ ప్రసాద్ బతుకమ్మ పండుగ ఏర్పాట్లను సమీక్షించారు . ఎస్సై లు ఎండీ ఇద్రిస్ అలీ ,వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బతుకమ్మ వేడుకల్లో పట్టణ ప్రముఖులు వార్డు కౌన్సిలర్లు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రంతో పాటు గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను ఆకర్షణీయంగా, ఎత్తుగా పేర్చారు. మున్సిపల్ కేంద్రంలో ఉన్నత పాఠశాల, వ్యవసాయ మార్కెట్ ఆవరణల్లో మహిళలు బతుకమ్మలను ఒకచోట పెట్టిఆడిపాడారు. గౌరమ్మను పూజించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
భువనగిరిరూరల్ : భువనగిరి మండల వ్యాప్తంగా సభ్యుల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారిన ఉదయం 5 గంటలకు లేచి వ్యవసాయ బావుల వద్ద పువ్వులను సేకరించినందుకు బయలుదేరారు. హైదరాబాద్ జిల్లా కేంద్రానికి భువనగిరి జిల్లా కేంద్రం దగ్గరగా ఉండడంతో రియల్ ఎస్టేట్ భూములు ఎక్కువగా ఉండడంతో తంగేడు, ముత్యాల, అడవి చామంతి పువ్వులు భారీగా తగ్గిపోయాయి. బతుకమ్మలో ఎక్కువగా ఉపయోగించే గునుగు పువ్వు అక్కడక్కడ తప్ప జాడ లేకుండా పోయింది. మార్కెట్లో పువ్వులను కొనుగోలు చేసి బతుకమ్మ తయారు చేయవలసిన పరిస్థితి నెలకొంది. బతుకమ్మ తయారు చేయడంలో తక్కువగా బంతిపూలను ఉపయోగించేవారు. ప్రస్తుతం అడవిలో పువ్వులు దొరకపోవడంతో ఎక్కువగా బంతిపూలను ఉపయోగిస్తున్నారు. మండలంలోని బసవపురం గ్రామంలో ఎంపీపీ నారాల నిర్మల వెంకట స్వామి యాదవ్ , ఆయా గ్రామాలలో మహిళ ఎంపీటీసీలు సర్పంచ్‌లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ : సద్దుల బతుకమ్మ పండుగను పట్టణకేంద్రంలో సోమవారం మహిళలు యువతులు చిన్నారులు ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మలను పేర్చి కాలనీల్లో ఒక చోట పెట్టి ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను ఊరి చివరన ఉన్న బావుల్లో నిమజ్జనం చేశారు.
ఘనంగా సుద్దుల బతుకమ్మ సంబురాలు
బొమ్మలరామరం : మండల లోని రామలింగపల్లి గ్రామంలో ఏ హచ్ఆర్ (ఎర్వ హేమంత్ రెడ్డి)సేన ఆధ్వర్యంలో సుద్దుల బతుకమ్మ సంబరాలు ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ హేమంత్ రెడ్డి , సర్పంచ్ యంజల కళా, ఉప సర్పచ్ తిరుపతి రెడ్డి ,వార్డు సభ్యులు,మహిళలు, పిల్లలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
భూదాన్‌పోచంపల్లి : పట్టణకేంద్రంలో వినోబాభావే పద్మశాలి సభా వేదిక వద్ద అన్ని వార్డులలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి జెడ్పిటిసి కోటపుష్పలత వైస్ ఎంపీపీ పాకవెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మెన్‌్ లింగస్వామి కౌన్సిలర్లు ఆయా గ్రామాల సర్పంచులు ,తదితరులు పాల్గొన్నారు.