Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలంలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలందరూ ఒకచోట చేర్చి పాటలు పాడుతూ సంతోషంగా సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించారు. మండలంలోని లింగాల గ్రామంలో టీఆర్ఎస్ నాయకురాలు గార్లపాటి స్వర్ణ శ్రీనివాసరెడ్డి, చిన్నగారకుంటతండా సర్పంచ్ శాలిభాయి, చీదేళ్ల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పరెడ్డి శోభావీరారెడ్డి, రకరకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మతో బతుకమ్మ ఆడారు.
అర్వపల్లి : మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.మహిళలు బతుకమ్మలను వివిధ పూలతో అలంకరించి ఆటపాటలతో నీటిలోకి వదిలిపెట్టారు.ఎంపీపీ మన్నె రేణుకలక్ష్మీనర్సయ్యయాదవ్ ,సర్పంచ్ ఉపేంద్రలింగరాజు, బైరబోయిన సునీతారామలింగయ్య, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.
ఆత్మకూరుఎస్: మండలంలోని ఏపూర్ గ్రామంలో ఘనంగ సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో సద్దుల బతుకమ్మలను చేసి బతుకమ్మ ఆడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సానబోయిన రజిత సుధాకర్, ఎంపీటీసీ దామిడి మంజులశ్రీనివాస్, ఉపసర్పంచ్ అవిరే పద్మఅప్పయ్య పాల్గొన్నారు.