Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో మునుగోడు ఉపఎన్నికల బరిలో భారీ సంఖ్యలో వీఆర్ఏలు నామినేషన్లు వేయనున్నారని వీఆర్ఏ జేఏసీ జిల్లా కన్వీనర్ కోరే యాదగిరి అన్నారు.సోమవారం మర్రిగూడ మండలంలో వీఆర్ఏల సమ్మె 71వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా వీఆర్ఏల సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పేస్కేల్ నేటికీ అమలు కాకపోవడంతో 40 మంది వీఆర్ఏలు ఆర్థిక ఇబ్బందులతో మరణించారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వీఆర్ఏలు భారీ ఎత్తున మునుగోడు ఉపఎన్నికల్లో నామినేషన్లు వేస్తారని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ వీఆర్ఏల డివిజన్ కొకన్వీనర్ పిట్టల పాండు, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు పాములనర్సింహ, రామస్వామి, బుచ్చయ్య, జంగయ్య, నర్సింహ, పెద్దులు, జయమ్మ, సాలమ్మ, సుగుణమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.