Authorization
Thu March 20, 2025 07:43:06 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భువనగిరి మండలం ఆకుతోటబాలితండ గ్రామానికి చెందిన కెతావత్ సోమ్లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రాష్ట్ర అధ్యక్షుడు, ట్రైకార చైర్మెన్ ఇస్లావత్ రామచంద్రునాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నుంచి బంజారా సేవా సంఘ్ తరుపున విశిష్టత సేవలు అందించినందుకు మరోసారి ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా టి.కిషన్ సింగ్, పాండ రంగ్ నాయక్, రామచంద్ర నాయక్, ఆర్.మోహన్ సింగ్ లకు, కృతజ్ఞతలు తెలిపారు.