Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పథకంతో నిరుపేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు చేయూతనిస్తుందని ఎంపీపీ రచ్చ కల్పనలక్ష్మీ నర్సింహారెడ్డి, మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి అన్నారు.మండలంలోని పనకబండ గ్రామంలో సోమవారం నూతన ఆసరా లబ్దిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ మారయ్య, సర్పంచ్ బత్తిని తిరుమలేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దాసరితిరుమలేష్, మాజీ సర్పంచ్ బత్తిని హన్మంతు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లోతుకుంట స్వామి, కారుపోతుల ముత్యాలు, పొన్నెబోయిన మత్స్యగిరి పాల్గొన్నారు.