Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన జిల్లా కలెక్టర్ సత్పతి పమేలా
నవతెలంగాణ - భువనగిరి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రైసింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రైసింగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం వల్ల పేద ప్రజలు లబ్ది పొందుతారన్నారు.ఆ అసోసియేషన్ అధ్యక్షులు హారూన్ షరీఫ్ మాట్లాడుతూ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో కులమతాలకుఅతీతంగా పేద వారికి సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, రైసింగ్ యాత్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అక్రమ్ అలీ, ఎండి.బురాన్ షరీఫ్, సభ్యులు ముజఫ్ఫార్ సిరాజ్, ఆసిఫ్, ఆమెర్ సిరాజ్ ఆసిఫ్ ఆజాం పాల్గొన్నారు.