Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
హైదరాబాద్, వరంగల్ జాతీయరహదారి జీడికల్ రోడ్డు అండర్ పాస్ నిర్మాణ పనులను సోమవారం ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి పరిశీలించారు . ఈ దారి గుండా వెళ్లే వాహన దారులకు గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ప్రస్తుతం అండర్ పాస్ నిర్మాణం పూర్తి కావడంతో పెను ప్రమాదాలు తప్పా యని ఆయన గుర్తుచేశారు . టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఈ సందర్బంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల పక్షాన అండర్పాస్ నిర్మాణాన్ని కృషి చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు .సాయిగూడెం వద్ద అండర్ పాస్ ఇరువైపులా వర్షం కారణంగా రోడ్లు నుండి వచ్చే నీటి కారణంగా సమస్య తలెత్తుతుందని స్థానిక రైతులు ఎంపీకి విన్నవించారు. రైతులు పొలాల్లో ట్రాక్టర్లు హార్వేస్టర్లు దున్నడానికి వెళ్లకుండా దారి బందీ అయ్యిందని, మరోవైపు శ్మశానవాటిక ఉందని, సమస్య పరిష్కరించాలని రైతులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కె . వెంకటేశ్వర రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యా సాగర్ ,తదితరులు పాల్గొన్నారు.