Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని సాయిబాబా కాలనీకి చెందిన రైతు అన్నెపు రాములు ఎద్దు ఇటీవల పిడుగు పాటుతో మృతి చెందింది. ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుండగా స్పందించిన మన మోత్కూరు వాట్సావ్ గ్రూపు సభ్యులు రూ.32 వేల విరాళం సేకరించారు. సోమవారం వాట్సాప్ గ్రూపు సభ్యులు ఆర్థిక సాయాన్ని రైతు రాములుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ గనగాని నర్సింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, వాట్సాప్ గ్రూపు సభ్యులు దబ్బెటి సోంబాబు, గంధం శ్రీనివాస్ రావు, కారుపోతుల వెంకన్న, కోమటి మత్స్యగిరి, వెలిమినేటి జహంగీర్, కోమటి జనార్దన్, గాదె వెంకటేశ్వర్లు, బోయిని వెంకట్, కొణతం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.