Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెయిన్ లైన్ వైరు తెగి వారం రోజులవుతున్నా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలం పరిధిలో జనగామ గ్రామంలో గత వారం రోజులుగా విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగి పడినా బిగించడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ప్రజల ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తగిన వైరును బిగించాలని రైతులు పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మరిబాయి తండాలో మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న ఇద్దరు బాలురు విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయిన సంఘటన పాఠకులకు వివిధమే. వ్యవసాయ పనుల కోసం బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. వారం రోజుల నుండి అటువైపు తాము వెళ్లకపోవడంతో పంటపొలాలు చనిపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిత్యం ఇదే నియోజకవర్గంలో తిరుగుతున్న కూడా అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.