Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు నియోజకవర్గంలో రానున్న శాసనసభ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని 9,13 వార్డుల్లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు వేయి మంది టీఆర్ఎస్లో చేరారు. చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ప్రభాకర్‌రెడ్డి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని తెలిపారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ తండ్రిలాగా కేసీఆర్ నిలిచిపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్, సింగిల్‌విండో చైర్మెన్లు బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు సుల్తాన్‌రాజు, కోరగోని లింగస్వామి, నాయకులు తొర్పునూరి నర్సింహాగౌడ్, తాడూరి పరమేశ్, బొడిగె బాలకృష్ణ, చెవగోని వెంకటేశ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, బొబ్బల రాజశేఖర్‌రెడ్డి, మచ్చసాగర్, బుడ్డ మల్లిఖార్జున్, సైదులు, గుణమోని మల్లేశ్‌యాదవ్, చింతల వెంకట్‌రెడ్డి, సుర్కంటి రాంరెడ్డి, తొర్పునూరి మల్లేశ్‌గౌడ్, భీమిడి రాంరెడ్డి, కట్కూరి కిరణ్, గంట నరేందర్, ఎస్కె.మున్నా, చెవగోని రమేశ్ పాల్గొన్నారు.