Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి రెవిన్యూ శాఖకు సంబంధించి ఐదు ఫిర్యాదులను స్వీకరించినట్టు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను సంబంధిత శాఖ వారు వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఒకసారి వచ్చిన ఫిర్యాదును రెండవసారి రాకుండా చూడాలన్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామాలలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ చర్యలు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామాలలో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం. నాగేశ్వరాచారి, అధికారులు పాల్గొన్నారు.