Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పట్టుగొమ్మగా నిలిచిన బతుకమ్మ ఉత్సవాల్లో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు తెలంగాణవ్యాప్తంగా అత్యంత వైభవపీతంగా జరిగింది. ప్రతి ఊరిలోను పూల పండుగ సంబురాలు అంబరాన్ని తాకాయి.ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబురాలు నేడు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తిరుమలగిరి మండల వ్యాప్తంగా ప్రతి ఊరిల, మున్సిపాలిటీ కేంద్రంలో ఆడబిడ్డలందరూ అత్యంత సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు మహిళలు తదితరులు అందరు పాల్గొన్నారు.
నూతనకల్: మండలకేంద్రంతో పాటు మండలపరిధిలోని ఆయా గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలను కోసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఇంట్లో గౌరీ మాతను నెలకొల్పి బతుకమ్మలను ఒకచోట చేర్చి ఉయ్యాలలు ఊగుతూ కోలాటాలు వేస్తూ నృత్యాలు చేస్తూ చూపులను అలరింపజేశారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు బతుకమ్మ ప్రాంగణాల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.
మద్దిరాల: మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను మహిళలు, ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా మహిళలు,యువతులు బాలి కలు రంగురంగల పూలతో బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని చెరువుల దగ్గర ఒక్క దగ్గర ఉంచి బతకమ్మ పాటలతో సందడి చేశారు.అనంతరం చెరువులలో నిమజ్జనం చేశారు.