Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీ నాగభూషణం
నవతెలంగాణ-నూతనకల్
అను నిత్యం పెరుగుతున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నాగభూషణం ప్రజలకు సూచించారు.సోమవారం మండల పరిధిలోని లింగంపల్లి లో నిర్వహించిన అవగాహనా సదస్సులో పాల్గొని మాట్లాడారు. సోషల్మీడియాలో ప్రజలను ఆకట్టుకునే ఆఫర్లు పెట్టి అనేక విధాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.వాళ్ల భారీ డిస్కౌంట్లకు ప్రజలు మోసపోయి సెల్ఫోన్లో తమ ఓటీపీ నెంబర్లను ఎవరికి చెప్పొద్దన్నారు. బ్యాంకర్ల పేరుతో అధిక అప్పులు ఇస్తామని కూడా నేరగాళ్లు మోసం చేస్తున్నారని అప్పు పొందాలంటే ఐదు నిమిషాలలో ఈనెంబర్కు కొంతనగదును వెంటనే పంపించాలని మెసేజ్లు పెడ్తారన్నారు.మెసేజ్లకు నమ్మి మోసపోవద్దన్నారు.ఏ బ్యాంకు మేనేజర్ కూడా లోన్ ఇస్తామని ఫోన్ చేసి అప్పు ఇస్తామని చెప్పరని బ్యాంకు చుట్టూ తిరిగి తన అన్ని ఆధారాలు ఉంటేనే లోన్ ఇచ్చేది కష్టమైన రోజుల్లో ఆన్లైన్ లో లోన్ ఎలా ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సీఐ నాగార్జున, స్థానిక ఎస్సై వై ప్రసాద్, సర్పంచ్ ఓరుగంటి ఉషా రామ్ కిషన్ రావు, ఎంపిటిసి మున్న లక్ష్మి మల్లయ్య యాదవ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.